బొప్పాయి (Papaya)

బొప్పాయి (Papaya)


బొప్పాయి (Papaya)

మన దేశంలో విరివిగా మరియు చవకగా లభించే పండ్లలో బొప్పాయి ఒకటి. ఇది చౌకైనది కాకుండా అద్భుతమైన పోషక విలువలు తో నిండి ఉన్నది. బొప్పాయి ఎలా వాడాలి దేనికోసం వాడాలో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం.

***********
ఈ పండు తీయగా రుచిగా ఉంటుంది. చలువ చేసి నీరు పెంచే శరీర తత్వాన్ని మారుస్తుంది రక్తస్రావము, రక్తం పడే మూలవ్యాధి మూత్ర ద్వారంలో పుట్టిన పుండ్లునివారిస్తుంది. అగ్ని మాంద్యాన్ని(Dyspepsia)నివారిస్తుంది అందాన్ని నివారిస్తుంది.
అయితే ఆలస్యంగాజీర్ణమవుతుంది,కఫ వాతల ను పెంచుతుంది చలువశరీర లకు జబ్బు చేస్తుంది. కడుపు నిండి ఉన్నప్పుడు ఇవి తినకూడదు.
దీనికి విరుగుళ్ళు, సొంటి మిరియాల చూర్ణం.

ఎండాకాలంలో ఒళ్ళు పేలుతున్న వాళ్లు బాగా పండిన బొప్పాయి గుజ్జును చేసి శరీరానికి లేపనం చేసి ఆరిన తర్వాత స్నానం చేస్తే తగ్గిపోతుంది.

కడుపులో క్రిములు చేరుకున్న వారు బొప్పాయి గింజల చూర్ణాన్ని ఒక టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే క్రిములు పోతాయి పచ్చి బొప్పాయి ముక్కలపై కొంచెం పటికబెల్లం, చల్లి తింటే కడుపులోని క్రిములు నశిస్తాయి.

పచ్చిబొప్పాయి కాయముక్కను సూది గా ఉన్న చెక్క ముక్క తో గి రండి( లోహపు వస్తువులు వాడవద్దు ) తెల్లని పాలు స్రవిస్తాయి. గాయం పైఈ పాలు
పూయండి. వెడల్పాటి చర్మం మందంగా బొప్పాయికాయ పైనుంచి వేరు చేసిదానిని పాలుపూసిన గాయంపై మూసి బ్యాండేజి కట్టండి. గాయాలు త్వరగానివారణ అవుతాయి. పుండు పెరగడం, చీము పట్టడం, చెడువాసన రావడం వంటివేమీ వుండవు.

పచ్చి బొప్పాయి కాయ చెక్కు తీసి వేసి దానిని కండను చిన్న ముక్కలుగా కోసి దానిపై సరిపడినంత ఉప్పు మిరియాల పొడి జీలకర్ర పొడి చల్లి నిమ్మరసం పిండండి. అజీర్ణం మలబద్ధకం ఉన్నవాళ్లు ఈ ముక్కలను తింటే అవి తగ్గుతాయికడుపులో నులిపురుగులు, ఏలికపాములు నశిస్తాయి మలేరియా నివారణ కు ఎంతో ఉపకరిస్తుంది. పాలిచ్చే తల్లులు తింటే వారిచను బాలు బాగా వృద్ధి చెందుతాయి.

భోజనానంతరం పండు ముక్కలు తింటే ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది

బొప్పాయి శక్తినిస్తుంది. చలువచేస్తుంది. పండిన బొప్పాయి ముక్కలు తో తేనె పాలు కలిపిన మిశ్రమంతో బలవర్ధకమైన టానిక్ వంటిది ఇది తింటే జి గుండె సంబంధిత వ్యాధులను వారికి ఎంతో మేలు జరుగుతుంది.పాలిస్తున్న తల్లులు కళ్ల సంబంధిత ఇబ్బందుల వారు ఈ మిశ్రమంతో ఎంతో లాభం పొందుతారు.

బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇది చాలా వేడిచేసి అబార్షన్ చేస్తుంది అంటారు.అందుకని గర్భవతులు నాలుగైదు నెలల వరకు బొప్పాయి పచ్చికాని పండుదిగాని ఏదీ తీసుకోకపోవడం ఎంతైనా మంచిది.

మూలవ్యాధి,మొలలు, లివర్, స్పినువ్యాధులతోబాధపడుతున్నవారికి బొప్పాయిఎంతో మేలుచేసే ఆహారం.
శరీరంపైని మచ్చలు, గాట్లు బొప్పాయి ముక్కతో రుద్దితే, తగ్గి చర్మం మామలుస్థితికి వస్తుంది.
బొప్పాయి ఆకు అరచేతి పరిమాణంలో కోసి శుభ్రంచేసి నమిలి మింగితేకడుపులోని క్రిములు, నులిపురుగులు నశిస్తాయి.

ఏడాది పొడవునా విరివిగా లభించేది బొప్పాయి.ఇందులో ఉన్న పోషకాలు మన అందరికీ ఎంతో ఉపయోగపడతాయి.
బొప్పాయి లో విటమిన్ సి పోలేట్ , పొటాషియం అధికంగా ఉంటాయి.
కంటికి మేలు చేసే విటమిన్ ఏ కూడా ఉంటుంది . క్యాన్సర్ ను నిరోధించే లైకోపీస్ కూడా సమృద్దిగా దొరుకుతుంది .
బొప్పాయి పీచు పదార్ధం ఎక్కువ . మలబద్దకాన్ని తొలగిస్తుంది

మీ చర్మాన్ని కాపాడుకోవటానికి విశిష్టమైన దివ్య ఔషధం.బొప్పాయి గుజ్జుని ఫేస్ ప్యాక్‌లా ముఖానికి రాసుకుంటే కాంతి వంతంగా తయారవుతుంది .
. మొటిమల నివారణ , ఆయిల్ ఫేస్ కూడా తగ్గుతుంది . చర్మం పై ఏర్పడిన మృత కణాలను బొప్పాయి పోగొడుతు౦ది .

చిన్న పిల్లలకు కడుపు నొప్పి , నులిపురుగులు అనిపిస్తే తరచు బొప్పాయి ని తినిపిస్తే నులిపురుగులు పోతాయి . దీనివల్ల ఆకలి పెరుగుతుంది .
రోజు బొప్పాయి ని తేనె తో పాటు తింటే గుండె , మెదడు , కాలేయం , నరాలకు రక్తప్రసరణ సవ్యంగా సాగుతుంది . మధుమేహ వ్యాది ఉన్నవాళ్ళు రోజుకు రెండు బొప్పాయి ముక్కలు తింటే విటమిన్స్ లోపం రాదు
శరీరంలో హాని కలిగించే టాక్సిన్లను బొప్పాయి నివారిస్తుంది.అంతేకాక ఇది జీర్ణవ్యవస్ధపై చక్కగా పని చేస్తుంది.

రోజూ బొప్పాయి తినటం వల్ల రోగ నిరోధక శక్తి బాగా అభివృధ్ధి చెందుతుంది.శరీరం లో హాని కలిగించే టాక్సిన్‌ల ను బొప్పాయి నివారిస్తుంది .
ఇది జీర్ణ వ్యావస్థ పై చక్కగా పనిచేస్తుంది

. శరీరంలోని కొవ్వు తీసేయటానికి బాగా పనిచేస్తుంది . గుండెపోటు రాకుండా నివారిస్తుంది . జ్వరం , జలుబు ,తో భాద పడే వారికి బొప్పాయి ఎంతో మంచిది .అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గాలంటే బొప్పాయిని రోజూ వాడితే బరువు తగ్గుతారు.
ఆడవారిలో తరచూ ఉండే ఋతుక్రమ సమస్యలను,రుతుక్రమ సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పిని కూడా బొప్పాయి తొలగిస్తుంది.

ఇన్ని మంచి గుణాలు ఉన్న పండుని వారానికి ఒకసారైనా తిని చూడండి .

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *